కేంద్ర కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
- July 04, 2016
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా 19 మందిని తీసుకున్నారు. స్వతంత్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు కేబినెట్ హోదాతో పదోన్నతి కల్పించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేశారు. అలాగే దళిత ఎంపీలకు ప్రాధాన్యమిచ్చారు. ఎన్డీయే మిత్రపక్షాలయిన రిపబ్లికన్ పార్టీకి చెందిన దళిత ఎంపీ రామ్‌దాస్ అథవాలే (మహారాష్ట్ర), అప్నా దళ్‌కు చెందిన అనుప్రియా పటేల్ (ఉత్తరప్రదేశ్)కు మంత్రి పదవులు దక్కాయి. బీజేపీలో కొత్తముఖాలకు చోటు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. జవదేకర్ కు పదోన్నతి స్వతంత్ర హోదాతో ఉన్న ప్రకాష్ జవదేకర్ కు పదోన్నతి లభించింది. కేబినెట్ మంత్రిగా తొలుత ఆయన ప్రమాణం చేశారు.కొత్త మంత్రులు ఫగన్‌సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్) ఎస్ఎస్ అహ్లూవాలియా(పశ్చిమబెంగాల్ ) రమేశ్ చంద్రప్ప జిగజినగీ (కర్ణాటక) విజయ్ గోయల్ (రాజస్థాన్) రామ్‌దాస్ అథవాలే (మహారాష్ట్ర) రాజేన్ గొహెయిన్ (అసోం) అనిల్ మాధవ్ దవే (మధ్యప్రదేశ్) పురుషోత్తం రుపాలా (గుజరాత్) ఎంజే అక్బర్ (మధ్యప్రదేశ్) అర్జున్ రామ్ మేఘవాల్ (రాజస్థాన్)

తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







