'ఓయ్ నిన్నే' రివ్యూ

- October 06, 2017 , by Maagulf
'ఓయ్ నిన్నే' రివ్యూ

రివ్యూ :  ఓయ్ నిన్నే
డైరెక్టర్ :  సత్య చల్లకోటి 
నిర్మాణం : ఎస్‌.వి.కె.  పతాకం 
నిర్మాతలు: వంశీకృష్ణ శ్రీనివాస్‌
సినిమాటోగ్రఫి : సాయి శ్రీరాం
మ్యూజిక్ :  శేఖర్ చంద్ర 
రిలీజ్ డేట్ : 2017 అక్టోబర్ 6న

సత్య చల్లకోటి దర్శకత్వంలో వంశీ కృష్ణ నిర్మించిన చిత్రం ఓయ్ నిన్నే. ఈ సినిమాలో భరత్ మార్గాని హీరోగా పరిచయం అవుతున్నాడు. కలసి ఉండే కటుంబంలో కూడా మనుషుల మద్య దూరాలుంటాయి.. కొండంత ప్రేమలున్నా అవి అర్ధం చేసుకోని స్వభావాలుంటాయి. వీటి మధ్యలో బావ మరదళ్ళ ప్రేమకథను చెప్పేందుకు ప్రయత్నించాడు దర్శకుడు సత్య చల్లకోటి.. మరి ఈ పల్లెటూరి ప్రేమలు ఎంత వరకూ ఆకట్టుకున్నాయో చూద్దాం.

కథ:
విష్ణు (భరత్) శేఖరంగారి అబ్బాయిగా ఊళ్ళో అంతా గౌరవం ఇస్తారు. మాస్టారి కొడుకు అన్న  పేరు తప్ప తన పేరు తెచ్చే పనేమీ చెయ్యడం లేదని, సరిగా చదువుకోడని తండ్రి (నాగినీడు) కోప్పడతుంటాడు. తనతో పాటు అదే ఇంట్లో పెరిగిన మరదలు (శృతి) తండ్రి ఇష్టాలనకుగుణంగా పెరిగుతుంది. శేఖరం స్నేహితుని కూతురి పెళ్ళి  ఆ అమ్మాయి ప్రేమించిన వాడితో చేస్తాడు విష్ణు. దీంతో తండ్రి కొడుకుల మధ్య దూరం మరింత పెరుగుతుంది.  ఇంట్లో అంతా తిడుతున్నా పట్టించుకోని విష్ణు, మరదలు విషయంలో మాత్రం బాధ్యతగా ఉంటాడు. ఆ బాధ్యతను ప్రేమ అనుకుంటుంది అమ్ములు. కానీ  విష్ణు అమ్ములు పై  ఉన్న ద్వేషం తప్ప ఇష్టాన్ని ఎప్పుడూ బయటపెట్టడు.  మరి తండ్రీ కొడుకల మధ్య దూరం ఎలా తగ్గింది..? అమ్ములుకు బావ మీద ఉన్న ప్రేమ పెళ్లి వరకూ వెళ్ళిందా అనేది  మిగిలిన కథ..?

కథనం:
పల్లెటూరిని తెరమీదకు తీసుకురావడంలో దర్శకుడు విజయం సాధించాడు.  తీసుకున్న కథ అలవాటు అయినదే అయినా పాత్రల మధ్య భావోద్వేగాలను పండించేందుకు దర్శకుడు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. భరత్ కొత్తవాడే అయినా చాలా కాన్ఫిడెంట్ గా చేసాడు.  తండ్రికి అంటే గౌరవం అదే సమయంలో తన జీవితం పట్ల తనకో నమ్మకం కలిగిన యువకుడి పాత్రలో భరత్ నటన బాగుంది. ప్రతి నలుగురిలో ఒకడిగా కనిపించే ఈ పాత్ర ఈజీగా రిలేట్ అవ్వోచ్చు.  కమెడియన్  సత్య పాత్ర బాగా ఎంటర్‌టైన్ చేసింది.  కాలేజ్ సన్నివేశాల్లోలో క్వశ్చన్స పేపర్స్ ఎపిసోడ్ బాగుంది.  హీరోయిన్ శృతి పాత్రకు తగ్గట్టుగా నటించింది. ట్రెండీ పర్సనాలిటీ కాకపోయినా నేటివిటీ లుక్స్‌తో ఆకట్టుకుంది.  ఎప్పుడూ కొడుకును తక్కువుగా చూడటం అలవాటయిన తండ్రికి అతనిలో ఉన్న మంచి కనపడదు. బాధ్యత తెలుసుకుంటాడని తిట్టడం అలవాటవుతుంది, తర్వాత అదే అలవాటు కొనసాగుతుంది. తప్పు చేస్తే తిట్టడం అటుంచి ఏం చేసినా తిట్టే వరకూ వెళ్ళిన తండ్రి పాత్రలో నాగినీడు చక్కగా చేసాడు. శేఖరంగారు అని ఊరంతా గౌరవించే పాత్రను తెరమీదకు తెచ్చాడు.  మరదలు ఇంట్లో ఉండటమే భరించలేనట్లు మెలిగేటప్పుడు హీరో, కమెడియన్ సత్యతో చేసిన అల్లరి ఆకట్టుకుంది.  హీరోయిన్ హెల్త్ క్యాంప్‌కి వెళ్ళిన ఎపిసోడ్ వారి మధ్య ప్రేమను ఎలివేట్ చేసే సన్నివేశాలు బాగా అమర్చుకున్నాడు దర్శకుడు.  తనమీద ఉన్నది ప్రేమ అనుకుంటుంది  హీరోయిన్ కాదు బాధ్యత అంటాడు హీరో.  ఆ బాధ్యత కూడా తన తండ్రి గురించి తీసుకున్నదే  అంటాడు.  హీరో హీరోయిన్స్ సినిమాకి వెళ్తారు తిరిగి వస్తుంటే  నీకు సినిమాలో హీరో అంటే ఇష్టమా అని అడుగుతుంది హీరోయిన్ అవును సినిమాలకి అతనే హీరో అంటాడు. మరి జీవితానికి అని అడిగితే మా నాన్న హీరో అంటాడు. మరి అది ఎప్పుడూ చూపించలేదే అంటే సినిమా రెండు గంటలుంటుంది చూపించాడు.. కానీ జీవితం అలాకాదు తెలుసుకోవాలి అంటాడు హీరో. తన తండ్రి మీద అతనికున్న గౌరవాన్ని తెలిపే సన్నివేశం అంది. అలాంటి  సున్నితమైన సన్నివేశాలను దర్శకుడు బాగా రక్తి కట్టించాడు.  చిన్నప్పటి నుండి ఇంట్లో అందరితో తిట్లు తినే బావ... ఒకసారి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెబుతాడు. దీంతో అతని బైక్ మీద ఎక్కేందుకు కూడా ఇబ్బంది పడి ఆటోలో వెళ్లి పోతుంది హీరోయిన్. ఇష్టం లేదు అని మోహం మీద చెబితే అదెంత కష్టంగా ఉంటుందో ఆమెకు అర్దం అయ్యే సన్నివేశాన్ని బాగా డీల్ చేసాడు దర్శకుడు.  జీవితం అంటే సాధించాలి, ఎక్కడికో వెళ్ళి ఏదో అయిపోవాలి అనుకోకుండా తనకున్న దాంట్లో దర్జాగా బతకాలనుకునే హీరో క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ ‘‘నీలా... ప్రపంచాన్ని జయించిన అలగ్జాండర్ కూడా ఒక్కరోజు బతకలేడు’’ అతని మావయ్యతో అనిపించడం దర్శకుడు ఆ పాత్ర పట్ల ఉన్న కన్వెక్షన్ కి అర్దం పడుతుంది. శేఖర్ చంద్ర అందించిన స్వరాలు ఈ మామూలు ప్రేమకథను గొప్పగా మలిచాయి. 
మనసా మనసా సాంగ్ చాలా బాగా పిక్చరైజ్ చేసాడు దర్శకుడు ఈ సినిమాలో సాయి శ్రీరాం సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పల్లెటూరి ని వెండితెరమీదకు తీసుకురావడంలో అతని ప్రతిభ చాలా ఉంది. ‘‘ వెంకటేశా శ్రీనివాసా అంటూ సరదాగా సాగే టీజింగ్ సాంగ్ చాలా ఎంటర్ టైనింగ్ ఉంది. అటువైపు నువ్వే ఇటు వైపు నవ్వే అంటూ పాత్రల మధ్య కన్‌ఫ్యూజన్ బాగా మలిచాడు దర్శకుడు.  పాటలన్నీ కథలో బాగంగా వచ్చేవే కథను నడిపించే కావడం పెద్ద రిలీఫ్‌గా అనిపించింది. కథకు ఎక్స్‌టెండెండ్ ఎమోషన్స్‌ని పాటల రూపంలో అందించాడు దర్శకుడు. కలిసి పెరిగిన వారు విడిపోయే సందర్భం వస్తే తప్ప వారి ప్రేమ బయటికి రాదు ఇలాంటి స్టోరీ లైన్ పాతదే అయినా దర్శకుడు ఆ కథను నడపించిన విధానం సరాదాగా ఉంది.  మంచి పాటలతో నేటివిటీ నవ్వులతో అక్కడక్కడా మనసుకు హాత్తుకునే మాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు..
చివరిగా: సరదాగా సాగే అలవాటయిన కథ  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com