జీవా 'కీ' తెలుగు టీజర్ విడుదల.!
- October 19, 2017'మీ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే మీరు మాత్రమే ప్రపంచాన్ని చూస్తున్నట్లు కాదు. ప్రపంచం మిమ్మల్ని కూడా చూస్తున్నట్టే' అంటున్నారు తమిళ కథానాయకుడు జీవా. 'రంగం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన నటించిన తాజా చిత్రం 'కీ'. కంట్రోల్ ఆల్ట్ డై అనేది ఉప శీర్షిక. నిక్కీ గల్రాని కథానాయిక.కలీస్ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి సందర్భంగా 'కీ' తెలుగు టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'మీరు ఎప్పుడు ఏడుస్తారు.. ఎప్పుడు నవ్వుతారు.. ఎప్పుడు ఐ లవ్వ్యూ చెబుతారోనని మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు' అంటూ వినిపించే సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఆట బ్లూవేల్. ఈ నేపథ్యంతోనే తాజా చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. కృష్ణ క్రియేషన్స్ బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై మైకేల్ రాయప్పన్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..