సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారా?
- December 26, 2017సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే మిగతా ఆరోగ్యం మీద కూడా కాస్త దృష్టి పెట్టండి. ముఖ్యంగా పురుషులు మరింత జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ఎందుకంటే సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరికి వూబకాయం, మధుమేహం వంటి జీవక్రియల జబ్బుల ముప్పూ పెరుగుతున్నట్టు స్వీడన్ అధ్యయనం పేర్కొంటోంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా గలవారిలో సెక్స్ హార్మోన్లు, ఇతర జీవరసాయనాల స్థాయులను పరిశీలించగా.. చాలామందిలో సెక్స్ హార్మోన్లు తక్కువగా ఉండటంతో పాటు జీవక్రియ జబ్బులు, ఎముక క్షీణత లక్షణాలూ బయటపడటం గమనార్హం. సెక్స్ హార్మోన్ల స్థాయులు తక్కువగా గలవారి రక్తంలో హెచ్‌బీఏ1సీ మోతాదులు కూడా ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు బలమైన సూచిక. అంటే వీరికి మున్ముందు మధుమేహం ముప్పూ పెరుగుతుందన్నమాట. అందువల్ల సంతాన సమస్యలు ఎదుర్కొనే పురుషులందరికీ సెక్స్ హార్మోన్ల స్థాయులను పరిశీలించటం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే తీవ్రమైన సమస్యల ముప్పు గలవారిని సంతాన చికిత్సల అనంతరమూ పరిశీలించటం అవసరమని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?