హాలీవుడ్ చిత్రం లో కిచ్చా!
- December 28, 2017పాత్ర బాగుండేలే కానీ ఏ భాష లోనైనా..ఎలాంటి రోల్ నైనా చేయడానికైనా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు కొంతమంది నటులు..అలాంటి వారిలో కన్నడ నటుడు సుదీప్ ఒకరు.కన్నడం లో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన ఈయన..తెలుగు లో ఈగ చిత్రం లో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాహుబలి మొదటి పార్ట్ లో కాసేపు కనిపించి అలరించారు. తాజాగా ఈయన కు హాలీవుడ్ లో ఛాన్స్ దక్కినట్లు తెలుస్తుంది.
ఆస్ట్రేలియన్ ఫిల్మ్ మేకర్ ఈడీ ఆర్య దర్శకత్వం లో తెరకెక్కనున్న యాక్షన్ డ్రామా లో సుదీప్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రష్యాలో జరిగే ఒక భారీ విస్ఫోటనం పేలుడుపై సినిమా కథ నడుస్తుందట. ఆ బ్లాస్ట్ వేలాది మంది జీవితాలను వికలాంగులను చేస్తుందట. సుదీప్ హై ఓల్టేజ్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం సుదీప్ ఓ కన్నడ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతాడని సమాచారం.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు