యు.ఏ.ఈ జాబ్‌ వీసా: ఇండియన్స్‌ కోసం యాప్‌

- January 23, 2018 , by Maagulf
యు.ఏ.ఈ జాబ్‌ వీసా: ఇండియన్స్‌ కోసం యాప్‌

న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ, స్మార్ట్‌ ఫోన్‌ అప్లికేషన్‌ని ప్రారంభించింది. ఈ యాప్‌ ద్వారా, యూఏఈలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ముందుగా, హెల్త్‌ చెకప్‌, పోలీస్‌ వెరిఫికేషన్‌ వంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ యాప్‌ ఉపకరిస్తుందని ఇండియాలో యూఏఈ రాయబారి డాక్టర్‌ అహ్మద్‌ అల్బన్నా చెప్పారు. ఈ యాప్‌ ఇండియాని సందర్శించే యూఏఈ జాతీయులకు కూడా ఉపకరిస్తుందని ఆయన అన్నారు. ఇండియాలో ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలలో యూఏఈ వీసా కేంద్రాలున్నాయి. ఢిల్లీలోని కార్యాలయం గత ఏడాది 50,000 మందికి వర్క్‌ వీసాలను మంజూరు చేసింది. మొత్తం 1.6 మిలియన్‌ ఇండియన్స్‌ గత ఏడాదిలో యూఏఈ సందర్శించారు. యూఏఈ జాతీయుల కోసం 'త్వాజుది' అనే సర్వీస్‌ని యూఏఈ ప్రారంభించింది. ఈ యాప్‌ ద్వారా పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్న సందర్భంలో, చిల్డ్రన్‌ రిటర్న్‌ డాక్యుమెంట్‌, యూఏఈ సిటిజన్‌ ప్రెజెన్స్‌ అబ్రాడ్‌, ఎస్కార్ట్‌ ట్రీట్‌మెంట్‌ - మెడికల్‌ కేసెస్‌, ఫైనాన్సియల్‌ మేటర్స్‌ వంటివాటికి అత్యవసర పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com