మగవారు గుప్పెడు శెనగలు స్వచ్చమైన నేతిలో వేయించి ప్రతిరోజు తీసుకుంటే?
- April 14, 2018
చాలామంది దంపతులు ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్యతో చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషులలో స్ఖలించే వీర్యంలో సంతాన సాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులుకంటే కూడా తీసుకునే ఆహారంలో వీర్యకణాలు పెంపొందించేవి తీసుకోవడం చాలా మంచిది. నల్ల శనగలు బహుముఖ పోషక పదార్థం. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల వీర్యకణాల లోపాన్ని సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇవి పురుషులలో వీర్యకణాల సమస్యను దూరం చేసే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి.
1. రాత్రిపూట ఒక కప్పు శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ శనగలలో బెల్లం కలిపి తినడం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పెరగడంతో బాటు వీర్యకణాల వృద్ధి కూడా పెరుగుతుంది.
2. గుప్పెడు శనగలను ఉడకపెట్టి వాటిని స్వచ్చమైన నేతిలో వేయించి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. తరువాత గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా అవడమే కాకుండా వీర్యకణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది.
3. గుప్పెడు శనగలు, నాలుగు బాదం పప్పులను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పరగడుపున బాగా నమిలి తినాలి. ఇలా కొన్ని రోజులు చేస్తుండటం వల్ల పురుషులలో వీర్యకణాలు పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!