మగవారు గుప్పెడు శెనగలు స్వచ్చమైన నేతిలో వేయించి ప్రతిరోజు తీసుకుంటే?
- April 14, 2018చాలామంది దంపతులు ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్యతో చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషులలో స్ఖలించే వీర్యంలో సంతాన సాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులుకంటే కూడా తీసుకునే ఆహారంలో వీర్యకణాలు పెంపొందించేవి తీసుకోవడం చాలా మంచిది. నల్ల శనగలు బహుముఖ పోషక పదార్థం. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల వీర్యకణాల లోపాన్ని సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇవి పురుషులలో వీర్యకణాల సమస్యను దూరం చేసే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి.
1. రాత్రిపూట ఒక కప్పు శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ శనగలలో బెల్లం కలిపి తినడం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పెరగడంతో బాటు వీర్యకణాల వృద్ధి కూడా పెరుగుతుంది.
2. గుప్పెడు శనగలను ఉడకపెట్టి వాటిని స్వచ్చమైన నేతిలో వేయించి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. తరువాత గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా అవడమే కాకుండా వీర్యకణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది.
3. గుప్పెడు శనగలు, నాలుగు బాదం పప్పులను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పరగడుపున బాగా నమిలి తినాలి. ఇలా కొన్ని రోజులు చేస్తుండటం వల్ల పురుషులలో వీర్యకణాలు పెరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..