నేడే 'నా పేరు సూర్య' ఆడియో లాంచ్
- April 21, 2018
అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'నా పేరు సూర్య'. 'నా ఇల్లు ఇండియా' అనేది టాగ్‌లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మిలిటరీ ఆఫీసర్‌గా దర్శనమీయనున్నాడు. బన్నీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి.
కాగా నేడు (ఆదివారం) ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం వేదిక కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ వేడుకలో అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్‌తో పాటు చిత్ర బృందం అంతా పాల్గొనబోతోంది. ఈ సినిమా మే 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







