రామ్ చరణ్, బోయపాటి షూటింగ్ ప్రారంభం
- April 22, 2018రంగస్థలం తరవాత ఏ మాత్రం బ్రేక్ తీసుకోవడం లేదు రామ్ చరణ్. తన తరువాతి చిత్రం కోసం నేటి నుంచి షూటింగ్‌కు హాజరయ్యాడు. ఈ రోజు నుండి బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్‌పైకి వచ్చేశాడు. మాస్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో తన 12వ చిత్రాన్ని చెర్రీ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్‌లను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. నేటి నుంచి మూడో షెడ్యుల్‌ను ప్రారంభించారు. బోయపాటి మార్క్ అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందీ సినిమా. రామ్ చరణ్‌ని డిఫెరెంట్ డైమెన్షన్లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాడు బోయపాటి.
ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రశాంత్, స్నేహ, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన భరత్ అను నేను ఫేమ్ కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్. ఇప్పటికే ఈ మూవీకి రాజవంశస్థుడు అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?