బిగ్ బ్రేకింగ్ : సినీ నటుడు బాలకృష్ణ సంచలన నిర్ణయం
- April 25, 2018
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మక 'ఎన్టీఆర్ బయోపిక్' చిత్రం నుంచి డైరెక్టర్ స్థానం నుంచి తేజ తప్పుకోవడంతో బాలకృష్ణ ఆ బాధ్యతను చేపట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. తన స్వీయ దర్శకత్వంలోనే 'ఎన్టీఆర్ బయోపిక్' సినిమాను తీయాలని అనుకుంటున్నట్టు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. భారీ స్టార్ కాస్టింగ్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో నర్తనశాల చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నారు బాలయ్య.. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా 'ఎన్టీఆర్ బయోపిక్' నుంచి అనూహ్యంగా తేజ తప్పుకోవడంతో ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు బాలకృష్ణ. కాగా గతంలో ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. అందులో ముఖ్యంగా దానవీర సూరకర్ణ , నర్తనశాల, పోతులూరి వీరబ్రహ్మగారి చరిత్ర వంటి సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!