బాలయ్య-తేజల మధ్య జరిగిన గొడవ!
- April 26, 2018
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న బయోపిక్ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నానని దర్శకుడు తేజ ప్రకటించడం నిన్న ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో అసలు తేజ ఈ సినిమా నుంచి ఎందుకు వైదొలిగాడన్న విషయం ఆరా తీసేందుకు సినీ ప్రముఖులు కూడా ఆసక్తి చూపారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలు పాటలు ఉండాలని బాలయ్య పట్టుబట్టాడు.. మరీ ముఖ్యంగా వేటగాడు చిత్రంలోని హిట్ సాంగ్ 'ఆకు చాటు పిందె తడిసె' పాటతో పాటు ఎన్టీఆర్ జయలలితతో చేసిన మరో సూపర్ హిట్ సాంగ్ కోటలోని మొనగాడా కచ్చితంగా ఉండాల్సిందేనని బాలయ్య పట్టుబట్టాడు. దీనికి తేజ ఒప్పుకోలేదు. ఇదే సమయంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రలో మొత్తం 50 గెటప్పులను సినిమా లో చూపిద్దామని బాలయ్య ప్రపోజ్ చేశాడు. అయితే ఈ గెటప్‌ల మధ్య పాటలు పెడితే సినిమా స్క్రీన్‌ప్లే లో సింక్ అవవని.. వీటి వల్ల కథ ఫ్లో మొత్తం దెబ్బతింటుందని తేజ అభిప్రాయపడ్డాడు. ఈ సినిమాలో కేవలం రెండు మూడు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ ఉంటే సరిపోతుందని తేజ భావించాడు. అలాగే, బాలయ్య చేస్తానన్న 50 ఎన్టీఆర్ గెటప్స్ లో అన్నీ బాలయ్య ఫిజిక్‌కు ఏ మాత్రం సెట్ కావని.. ఫిట్ అవని గెటప్‌లు చేసి విమర్శలు ఎదుర్కోవడం కన్నా.. వేయకపోవడం బెటర్ అని తేజ చెప్పినట్లు తెలుస్తోంది.
దీనిపై ఇద్దరికీ అభిప్రాయభేదాలు నడుస్తుండగానే.. మే నెలలో 15 రోజుల షూటింగ్ తో పాటు ఓ పాటను చిత్రీకరించాలని బాలయ్య కోరగా.. స్క్రిప్ట్ పై ఇంకా వర్క్ చేయాల్సి ఉందని.. అది పూర్తవకుండా తనకు సెట్స్ పైకి వెళ్లడం ఇష్టం లేదని తేజ మొహమాటం లేకుండా చెప్పేశాడు. దీంతో బాలయ్య తేజ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన తప్పుకున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







