తగ్గిన బంగారం ధర...

- April 27, 2018 , by Maagulf
తగ్గిన బంగారం ధర...

దిల్లీ:పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో ఇటీవల బంగారం ధర బాగా పెరిగింది. కాగా అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో నేటి బులియన్‌ మార్కెట్లో పసిడి ధర పడిపోయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కూడా డిమాండ్‌ తగ్గినట్లు మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. నేడు పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.190 తగ్గి రూ.32,210గా ఉంది. వెండి కూడా ఇదే బాటలో పయనించింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.40,450గా ఉంది. పారిశ్రామిక అవసరాలకు, నాణేల తయారీకి కూడా డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. రూపాయి మారం విలువ బలహీన పడి డాలరు విలువ పెరగడం కూడా ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.48శాతం తగ్గి 1316.30డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.27శాతం తగ్గి 16.47 డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com