తెలుగు వారి సత్తాను దేశానికి చూపిన మన ఆణిముత్యాలు..
- April 27, 2018
ఓటమి గెలుపుకి పాఠం అవుతుంది.. పట్టుదల విజయతీరాలకు చేరుస్తుంది.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగిన తెలుగు తేజం అనుదీప్ అనుకున్నది సాధించి చూపించాడు. సివిల్స్‌లో టాపర్‌గా నిలిచి తెలుగు వారి సత్తా ఏంటో దేశానికి చూపించాడు. 990 మంది సివిల్స్‌కు ఎంపికైతే.. అందులో మొదటి వ్యక్తి మన తెలుగు తేజం కావడం విశేషం.
సివిల్స్‌లో తెలుగు వెలుగులు విరబూశాయి.. ఈ ఏడాది కూడా ఫలితాల్లో మనోళ్ల కొనసాగింది. తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంక్ సాధించగా.. అనుకుమారి రెండో ర్యాంక్ కైవసం చేసుకున్నారు.. సచిన్ గుప్తా మూడో ర్యాంక్ సాధించాడు. టాప్ ప్లేస్‌లో నిలిచిన అనుదీప్ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వాసి.
గతేడాది అక్టోబర్- నవంబర్ మధ్య సివిల్స్ పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్ 28న యూపీఎస్సీ మెయిన్ పరీక్ష నిర్వహించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య మౌఖిక పరీక్షలు నిర్వహించి మొత్తం 990 మంది పేర్లను ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌తో పాటు గ్రూప్-ఎ, గ్రూప్-బి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఎంపిక చేసింది.
జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మంది వివిధ పోస్టులకు ఎంపికయ్యారు. సాయితేజ 43వ ర్యాంక్ సాధించగా.. అనంతపురం జిల్లాకు చెందిన అమిలినేని భార్గవ తేజ 88వ ర్యాంక్‌లో నిలిచాడు. నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంక్, జి.మాధురి 144వ ర్యాంక్, వివేక్ జాన్సన్ 195 ర్యాంకు దక్కించుకున్నారు. మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్‌కు 196వ ర్యాంక్ వచ్చింది. అక్షయ్ కుమార్ 654వ ర్యాంక్, భార్గవ శేఖర్ 816వ ర్యాంకు సాధించారు.
తాజా వార్తలు
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!







