దుబాయ్:14 మిలియన్ దిర్హామ్ దొంగతనం ఏడుగురిపై విచారణ
- April 27, 2018
దుబాయ్:మనీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవర్, అతని ఇద్దరి స్నేహితులు 14 మిలియన్ దిర్హామ్ దొంగతనం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. 14 మిలియన్ దిర్హామ్‌ల విలువైన 10 ఏటీఎం బాక్సుల్ని దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. వీరికి సహకరించిన మరో నలుగురిపైనా కేసులు నమోదయ్యాయి. వీరందరూ పాకిస్తాన్‌కి చెందినవారే. వీరిలో ఒకరు మనీ ఎక్స్‌ఛేంజ్ ఆఫీస్‌లో పనిచేస్తున్నారు. ఫేక్ పాస్‌పోర్టులపై పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దొంగతనం కోసం పూర్తిగా సన్నద్ధమైన వీరంతా పకడ్బందీగా హోటల్ రూమ్స్‌ని కూడా తాత్కాలిక నివాసం నిమిత్తం బుక్ చేసుకున్నట్లు విచారణలో తేలింది. దొంగతనం జరిగిన రెండు గంటల్లోనే దేశం నుంచి పారిపోయేందుకు ఫేక్ పాస్‌పోర్టులు సిద్ధం చేసుకున్నట్లు మొదటి నిందితుడు విచారణలో చెప్పాడు. నిందితులంతా 27 నుంచి 48 ఏళ్ళ వయసులోపువారే.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







