ఏపీలో కొత్త కొలువులు: 10,351 పోస్టులకు నోటిఫికేషన్లు
- April 28, 2018
అమరావతి:నిరుద్యోగులకు శుభవార్తను అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా 10,351 పోస్టులకు నోటిపికేషన్లు విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 4న టెట్ నోటిఫికేషన్, జులై 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మే 5 నుంచి 22 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ అవుతాయని , జూన్ 10 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. జులై 7 నుంచి డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తామని గంటా తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా ఆన్లైన్లో డీఎస్సీని నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!