వాట్సాప్ సిఇఒ రాజీనామా
- April 30, 2018
సాన్ఫ్రాన్సిస్కో : ఫేస్బుక్ సంస్థకు చెందిన వాట్సాప్ సిఇఒ జాన్ కౌమ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. ఫేస్బుక్కు సంబంధించి గత కొన్ని వారాలుగా నడుస్తున్న ప్రైవేట్ కుంభకోణం నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఫేస్బుక్ పేజీలో సోమవారం పేర్కొన్నారు. 2014లో ఫేస్బుక్ సంస్థకు వాట్సాప్ను విక్రయించిన సంగతి తెలిసిందే. వినియోగదారుల డేటా భద్రత వాట్సాప్ ముఖ్య ఉద్దేశం. కాని డేటా భద్రతలో ఘర్షణలు వెలువడుతుండటం, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడానికి ఫేస్బుక్ అనుమతించడం వంటివి ముఖ్య కారణాలు. కాగా, దీనిపై ఫేస్బుక్ నిర్వాహకులు స్పందించలేదు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







