ఫ్యామిలీతో మహేష్ పారిస్ టూర్
- April 30, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం బిగ్ హిట్ కొట్టడంతో ఈ సక్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో వెకేషన్ టూర్ వేశాడు మహేష్. సినిమా రిలీజ్‌కి ముందే ఓ సారి పారిస్ వెళ్లొచ్చిన మహేష్ మరోసారి అదే ప్రదేశానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. సినిమా రిలీజ్ తర్వాత భరత్ అనే నేను సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్ళాడు. అక్కడ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలసి సినిమా చూశాడు. రెండు ఫ్లాపుల తర్వాత ఇంత పెద్ద హిట్ ఇచ్చిన కారణంగా పలు పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించాడు మహేష్. విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతి వెళ్ళాడు. ఆ తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహాస్వామి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. తాను బ్రతికినంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటానని మహేష్ తెలిపిన విషయం విదితమే. త్వరలో వంశీ పైడిపల్లి సినిమా టీంతో జాయిన్ కానున్నాడు మహేష్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ న్యూయార్క్‌లో జరగనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం