యూఏఈలో ఇలా చేస్తే 1 మిలియన్ దిర్హామ్‌ల జరీమానా
- May 01, 2018
దుబాయ్: ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే సమయంలో అప్రమత్తంగా వుండాలి. ఫాల్స్ న్యూస్‌ని పోస్ట్ చేసినా, షేర్ చేసినా భారీగా జరీమానాలు చెల్లించాల్సి రావొచ్చు. ఈ జరీమానా 1 మిలియన్ దిర్హామ్ వరకు వుంటుంది. టెలికమ్యూనికేషన్స్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ), సోషల్ మీడియాలో ఫేక్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రూమర్స్ కావొచ్చు, తప్పుడు వార్తలు కావొచ్చు, విద్వేషపూరితమైన విషయాలు కావొచ్చు, మీ దృష్టికి వస్తే, వాటి జోలికి వెళ్ళొదు. వీలుంటే, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. అంతేగానీ, వాటిని తిరిగి ఎవరికైనా పంపితే మాత్రం చిక్కులు ఎదురవుతాయి. టిఆర్‌ఏ ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ పెట్టింది. యూఏఈ యాంటీ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం ఉల్లంఘనులకు 1 మిలియన్ దిర్హామ్‌ల వరకు జరీమానా పడుతుందని టిఆర్‌ఏ పేర్కొంది. షేర్ చేసిన మెసేజ్‌ని బట్టి ఉల్లంఘనను నిర్ధారించి జరీమానా శిక్ష విధించడం జరుగుతుంది. అత్యధిక జరీమానా 1 మిలియన్ దిర్మామ్‌లు. సో, బీ కేర్ ఫుల్.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!