కోలుకుంటున్న చిన్నారుల్ని కోల్పోయిన తండ్రి
- May 02, 2018
మస్కట్: భారతీయ వలసదారుడు కన్నన్ సుభాస్, కోలుకుంటున్నారు. షినాస్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంలో కన్నన్ సుభాస్ తన కుమారుడు, కుమార్తెను కోల్పోయారు. 43 ఏళ్ళ కన్నన్, నాలుగేళ్ళ రోహిత్, ఆరేళ్ళ చంద్రిక బైక్ మీద వెళుతుండగా, బైక్ స్కిడ్ అవడంతో వీరంతా మరో వాహనం కిందికి దూసుకుపోయారు. ఈ ప్రమాదంలో కన్నన్ కుమారుడు, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో కన్నన్ ఆసుపత్రిలో చేరారు. షినాస్‌లోని ఓ ప్రభుత్వ కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నారు. సమ్మర్ వెకేషన్ సందర్భంగా తన కుటుంబాన్ని ఒమన్‌కి తీసుకొచ్చారాయన. వచ్చేవారంలో తిరిగి వారంతా స్వదేశానికి వెళ్ళాల్సి వుంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో ప్రస్తుతం కన్నన్ చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!