'జంబలకిడి పంబ' టీజర్ విడుదల
- May 03, 2018
1993లో ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన జంబలకిడి పంబ చిత్రం సినీ లవర్స్ పొట్ట చెక్కలయ్యేలా ఎంతగా నవ్వించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడాళ్ళు మగాళ్ళుగా మారి ఆదిపత్యం చలాయించడం, మగాళ్ళు ఆడాళ్ళుగా మారి వంటింటికి పరిమితం కావడం వంటి సన్నివేశాలు సిల్వర్ స్క్రీన్పై పసందైన విందు అందించాయి. అయితే జంబలకిడి పంబ టైటిల్తో మరో చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించనుంది. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా చిత్రాలలో సోలో హీరోగా నటించిన శ్రీనివాస రెడ్డి ప్రధానపాత్రలో మరో జంబలకిడి పంబ తెరకెక్కుతుంది. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జంబలకిడి పంబ. ఈ మూవీ రొమాంటిక్ కామెడీగా ఉంటుందని తెలుస్తుంది. గోపి సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, అరకు, వైజాగ్, కేరళ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదల చేశారు. ఇందులో పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ముంబై మోడల్ సిద్ధి ఇద్నానీ ఈ చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అవుతుంది. టీజర్ చూసి మీరు ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!