తగ్గిన బంగారం ధర!
- June 12, 2018క్రమంగా పసిడి ధరలు కిందకి దిగొస్తున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు తగ్గాయి.. రూ.150 రూపాయలు ధర తగ్గిన 10 గ్రాముల బంగారం ధర 31,800 రూపాయలుగా నమోదైంది. అలాగే కేజీ వెండి ధర రూ.1,110 పెరిగి రూ.41,560గా నమోదైంది. దీనికి కారణం స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ అంతగా లేకపోవడంతో బంగారం ధరలు మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే మంగళవారం అమెరికా-ఉత్తరకొరియా మధ్య చర్చలు సఫలమవడంతో క్రమంగా డాలర్ బలపడుతోంది. యెన్‌తో పోలిస్తే అమెరికా డాలర్ మూడు వారాల గరిష్టానికి చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు కిందకి పడిపోతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?