ములగకాయ విత్తనాలతో అదిరిపోయే శక్తి సామర్థ్యం...

- August 01, 2018 , by Maagulf
ములగకాయ విత్తనాలతో అదిరిపోయే శక్తి సామర్థ్యం...

ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి వృక్షంతోనూ మనకు ఏదోవిధంగా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ములగ చెట్టు తీసుకోండి. ములగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్ని చిట్కాలను చూద్దాం. ఎండిన ములగకాయలోని విత్తనాలను పొడి చెయ్యాలి. ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీనివల్ల బి.పి కంట్రోల్ అయి ఆదుర్దా తగ్గుతుంది.

మొటిమలతో బాధపడేవారు ములగాకు రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ములగాకు రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్ణ సంబంధ బాధ ఉండదు. ములగాకు పొడిని రోజూ పరగడుపున చెంచా పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే గ్యాస్ట్రిక్ అల్సర్ దరిచేరదు. 
 
ములగాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలపై రాయాలి. ములగ గింజలని చూర్ణం చేసి కషాయంగా వాడినా తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. ములగాకు నీడలో ఆరబెట్టి, పొడిచెయ్యాలి. ఆ పొడిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు రాసుకొని కొంత సేపు ఆగి తలస్నానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
 
ములగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని స్తంభన కలుగుతుంది. ములగ పూలు, పాలలో వేసుకొని తాగాలి. దీనివలన ఆడవారికి, మగవారికి శృంగార సామర్థ్యం పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com