ఎన్టీఆర్ బయోపిక్.. బాలయ్య బాబు ఫస్ట్ లుక్ విడుదల
- August 14, 2018క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలయ్యబాబు హీరోగా నటిస్తున్న సినిమా ఎన్టీఆర్. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎన్టీఆర్ బయోపిక్ లో .. నందమూరి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. తెలుగు వారి గుండెచప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్‌ని చూసిన ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎన్టీఆర్ లుక్ లో ఉన్న బాలకృష్ణ పిక్‌ని చూసిన అభిమానులంతా.. అచ్ఛం ఎన్టీఆర్ లా ఉన్నారని మురిసిపోతున్నారు. ఈ పిక్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ పిక్ మరింత జోష్ని ఇచ్చింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?