ఫేస్ బుక్‌లో పోర్న్ వీడియో పోస్టింగ్: వ్యక్తిపై అభియోగాలు
- September 18, 2018ఓ యువకుడిపై ఫోస్బుక్లో పోర్న్ వీడియో పోస్ట్ చేసినట్లు అభియోగాలు నమోదు కావడంతో, రస్ అల్ ఖైమా మిస్డెమీనర్ కోర్ట్ యెదుట అతన్ని హాజరు పరిచారు పోలీసులు. ఓ మహిళకు చెందిన పోర్న్ వీడియోని షేర్ చేసి, ఆ మహిళకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడు అరబ్ జాతీయుడు. అయితే, తాను ఎలాంటి న్యూడ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని నిందితుడు తన వాదనను విన్పించాడు. 'నేను ఇతరుల్లాగానే వీడియో చూశాను. అయితే దాన్ని ఎవరికీ షేర్ చేయలేదు' అని పేర్కొన్నాడు నిందితుడు. సోషల్ మీడియాలో తన వాయిస్‌తో ఓ వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశాను తప్ప, అందులో మహిళకు వ్యతిరేకంగా ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలూ చేయలేదని అన్నాడు. న్యాయస్థానం కేసు విచారణను ఈ నెలాఖరుకు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?