యాప్ ద్వారా దుబాయ్‌లో పార్కింగ్ రిజర్వేషన్
- October 15, 2018దుబాయ్:పార్కింగ్ స్పేస్ కోసం వృధాగా సమయాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆర్టిఎ (దుబాయ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) ఈ మేరకు పార్కింగ్ రిజర్వేషన్ యాప్‌ని 38వ జిటెక్స్ వీక్ సందర్భంగా ప్రారంభించింది. పార్కింగ్ రిజర్వేషన్ని 10 దిర్హామ్‌ల అడ్వాన్స్ ప్రీమియమ్‌తో పొందేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తుంది. గంటకు 10 దిర్హామ్‌లు చెల్లించి, పార్కింగ్ పొందవచ్చు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో చెల్లింపులు చేయడానికి వీలుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. త్వరలో ఐవోఎస్ పవర్డ్ గ్యాడ్జెట్స్, ఐఫోన్లలోనూ పనిచేసేలా యాప్‌ని తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పార్కింగ్ రిజర్వేషన్స్ దుబాయ్ మెరినా, దుబాయ్ మీడియా సిటీలలోనే అందుబాటులో వుండగా, ముందు ముందు మరిన్ని ప్రాంతాల్లో ఈ అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం