యూఏఈ రెసిడెంట్స్‌కి వాట్సాప్‌ వార్నింగ్‌

యూఏఈ రెసిడెంట్స్‌కి వాట్సాప్‌ వార్నింగ్‌

యూఏఈ: ప్రముఖ యాప్స్‌ని అనాధరైజ్డ్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటున్నారా? మీకు ఓ హెచ్చరిక. యూఏఈ టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ ఈ మేరకు రెసిడెంట్స్‌కి హెచ్చరికలు జారీ చేసింది. 'స్పెషల్‌ ఫీచర్స్‌' పేరుతో కొన్ని అనాథరైజ్డ్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయనీ, వీటి పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు పేర్కొన్నారు. ఆ యాప్స్‌ ద్వారా ప్రైవసీ దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్‌ సపోర్ట్‌ టీమ్‌ పేరుతో కొందరు డూప్‌ వెర్షన్స్‌ని ప్రచారంలోకి తీసుకు వచ్చారనీ, వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుందని అధికారులు హెచ్చరించారు. 

 

Back to Top