టాయ్లెట్లో వీడియో: క్లీనర్‌కి మూడు నెలల జైలు
- November 13, 2018దుబాయ్: మహిళల టాయిలెట్లో ఫోన్‌ని వుంచి, దాన్ని వీడియో మోడ్‌లో పెట్టిన క్లీనర్‌కి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితుడు 27 ఏళ్ళ వయసున్న వ్యక్తి.. భారతదేశానికి చెందిన నిందితుడు, దుబాయ్ మెట్రో స్టేషన్లో పనిచేస్తున్నాడు. మహిళలు వినియోగించే టాయిలెట్స్‌లో మొబైల్ ఫోన్ వుంచడం, ద్వారా అసభ్యకర రీతిలో మహిళల్ని ఫోన్లో చిత్రీకరించాలన్న నిందితుడి ఆలోచనను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. అయితే విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించలేదు. తన ఫోన్‌ని టాయిలెట్లో పొరపాటున మర్చిపోయానని పేర్కొన్నాడు. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో జూన్ 30న ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదయ్యింది. టాంజానియాకి చెందిన రిసెప్షనిస్ట్, టాయిలెట్లో మొబైల్ ఫోన్‌ని గుర్తించి, పోలీసులకు పిర్యాదు చేశారు. కాగా, రెండు సార్లు తాను ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?