సిటీ సెంటర్ మస్కట్ ఫ్రీ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్
- December 18, 2018మస్కట్: సిటీ సెంటర్ మస్కట్ షాపింగ్‌కి వెళుతున్నారా? మీకు ఎలక్ట్రిక్ కారు వుంటే, అక్కడ ఉచితంగా మీ కారుకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మరియు ఆసియాల్లో ప్రముఖ షాపింగ్ మాల్, కమ్యూనిటీస్, రిటెయిల్ మరియు లీజర్ పయనీర్ అయిన మజిద్ అల్ ఫుత్తైమ్ సిటీ సెంటర్ మస్కట్ వద్ద ఈ ఛార్జింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంతో పర్యావరణానికి హాని తప్పుతుందన్న కోణంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా వాహనాల వినియోగం ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సిటీ సెంటర్ మస్కట్ వద్ద ఉచిత ఛార్జింగ్ యూనిట్‌ని అందుబాటులోకి తెచ్చారు. లెవల్ వన్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడ్తుండడంతో.. సిటీ సెంటర్ మస్కట్ మాల్ (మాజిద్ అల్ ఫుత్తైమ్) తనవంతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..