'తస్సాదియ్యా..' ప్రోమో వీడియో సాంగ్ విడుదల
- January 04, 2019బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం వినయ విధేయ రామ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చిత్ర బృందం చెబుతుంది. అయితే ఈ చిత్రంలో తస్సాదియ్యా.. అంటూ సాగే పాటకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని జస్ప్రీత్ జాజ్, మానసి ఆలపించారు. తాజాగా ఈ డ్యూయట్ సాంగ్ వీడియోని విడుదల చేశారు.ఇందులో చరణ్, కియారాలు తమ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వీడియో అభిమానులని ఆకట్టుకుంటుంది. చిత్రానికి దేవి శ్రీ అందించిన బాణీలు అద్భుతంగా ఉన్నాయి. స్నేహా, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, అనన్య, ఆర్యన్ రాజేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ భామ ఈషా గుప్తా ఇందులోని ప్రత్యేక గీతంలో నటించారు. యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..