ఈ నెల 25న సూపర్ 30 విడుదలకు సిద్ధమవుతోంది
- January 07, 2019బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న కొత్త చిత్రం సూపర్ 30. వికాస్ బాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విద్యావేత్త ఆనంద్ కుమార్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. పాట్నా నగరానికి చెందిన ఆనంద్.సూపర్ 30 అనే కార్యక్రమం ద్వారా అత్యంత ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసి వాళ్లకు ఐఐటీ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి దాకా సూపర్ 30 ద్వారా ఎందరో పేద విద్యార్థులు ఐఐటీలో ప్రవేశం పొందారు. ప్రపంచంలో ఎందరినో ఆలోచింపజేసింది ఆనంద్ కుమార్ కృషి. సమాజం పట్ల ఆయనకున్న సేవాదృక్పథం ఇప్పుడు బాలీవుడ్‌ను ఆకర్షించింది. ఈ నేపథ్యంతోనే సూపర్ 30 రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్ 30లో నటించడంపై హృతిక్ స్పందిస్తూ..మన జీవితాల్లో అత్యంత గొప్ప విషయం సేవ. సమాజానికి, మన తోటి మనుషులకు సాయం చేయడం అనేది అత్యుత్తమం. నా పిల్లలకు ఇదే విషయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తుంటాను. రేపు నేను వాళ్లకు ఇవ్వబోయే అసలైన ఆస్తి సేవా దృక్పథమే అనుకుంటాను.
ఈ సామాజిక సేవ మన చుట్టూ సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. తద్వారా ప్రపంచాన్ని మార్చే శక్తినిస్తుంది. అన్నారు. ఈ నెల 25న సూపర్ 30 విడుదలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు