సామూహిక నిరాహార దీక్షకు పాలస్తీనా ఖైదీలు సిద్ధం

- January 08, 2019 , by Maagulf
సామూహిక నిరాహార దీక్షకు పాలస్తీనా ఖైదీలు సిద్ధం

జెరూసలేం : జైళ్ళలో పరిస్థితులను మరింత అధ్వాన్నం చేసేలా కొత్త చర్యలు చేపట్టాలని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం భావిస్తోంది. అదే గనుక జరిగితే మూకుమ్మడిగా నిరాహార దీక్ష చేపట్టేందుకు ఇజ్రాయిల్‌ జైళ్ళు, నిర్బంధ కేంద్రాలు, ఇంటరాగేషన్‌ కేంద్రాల్లోని వందలాదిమంది పాలస్తీనియన్లు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఖైదీలు, పాలనాపరమైన నిర్బంధితులు (ఎలాంటి అభియోగాలు లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నవారు) ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఇజ్రాయిల్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం కొత్త తరహా అణచివేత చర్య అని వారు వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తీసుకోవడమంటే యుద్ధం ప్రకటించడమేనని, దీంతో తమ పోరాటంలో కొత్త దశ ఆరంభమైందని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. తమకు సంఘీభావంగా నిలబడాల్సిందిగా వారు పాలస్తీనా వర్గాలను, కార్యకర్తలను కోరారు. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. ఇజ్రాయిల్‌లో 5500 పాలస్తీనా ఖైదీలు వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com