ఫ్లిప్‌కార్ట్‌లో అసుస్ డేస్ సేల్..
- January 10, 2019ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అసుస్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. బుధవారం ప్రారంభమైన ఈ సేల్ శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో పలు అసుస్ ఫోన్లపై భారీ రాయితీలు, ఆఫర్లను ప్రకటించింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ అసుస్ జెన్‌ఫోన్ 5 జడ్ వేరియంట్ రూ.8 వేల తగ్గింపుతో రూ.28,999 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.8 వేల తగ్గింపుతో రూ.24,999 ధరకు లభిస్తుంది.
జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ వెయ్యి తగ్గింపుతో రూ.12,999 ధరకు.. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 10,999 ధరకు.. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.8,999 ధరకు అందుబాటులో ఉంది. ఇక అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్1 రూ.4,999 ధరకు లభిస్తుంది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..