మస్కట్ ఫెస్టివల్: ఈ వస్తువులపై నిషేధం
- January 10, 2019మస్కట్: 21వ ఎడిషన్ మస్కట్ ఫెస్టివల్, ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పెస్టివల్ ప్రాంగణంలోకి కొన్ని వస్తువుల్ని తీసుకెళ్ళకూడదంటూ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కల్నల్ సైద్ అల్ అస్మి, జనరల్ మేనేజర్ - ఆపరేషన్స్ - రాయల్ ఒమన్ పోలీస్ మాట్లాడుతూ, బ్యాన్ చేసిన వస్తువుల వివరాల్ని తెలియజేశారు. బ్యాన్ చేసినవాటిల్లో లైటర్స్, హార్న్స్, నైఫ్స్ వున్నాయి. ఫైర్ క్రాకర్స్, షార్ప్ టూల్స్ - కత్తి లాంటివి అమర్చిన స్టిక్స్, వైట్ వెపన్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్, లేజర్ లైటింగ్, ఐరన్ ఛెయిన్స్, విజిల్స్, హార్న్స్, ఫొటోలు కలిగిన క్లాత్స్, రెలిజియస్ వాల్యూస్‌ని దెబ్బతీసేలా రాతలున్న వస్తువులు లేదా క్లాత్స్‌ని ఫెస్టివల్లోకి అనుమతించరు. నసీమ్ గార్డెన్, అల్ అమెరాత్ పార్క్ ప్రాంతాల్లో మెయిన్ యాక్టివిటీస్ జరుగుతాయి. ప్రతి రోజూ 4 నుంచి 11 గంటల వరకు వుండే ఈ ఫెస్టివల్, వీకెండ్స్‌లో మాత్రం మరో గంట అదనంగా అంటే 12 గంటల వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..