హత్య కేసులో ఆసియా జాతీయుడికి జైలు

హత్య కేసులో ఆసియా జాతీయుడికి జైలు

హై క్రిమినల్‌ కోర్టు 38 ఏళ్ళ ఆసియా జాతీయుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన సహచరుడైన ఓ వ్యక్తిని హతమార్చినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఇద్దరి మధ్యా తలెత్తిన చిన్న వివాదం గొడవగా మారి, హత్యకు దారి తీసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. హత్య జరిగిన సమయంలో నిందితుడు, బాధితుడు మద్యం సేవించి వున్నారనీ, తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో నిందితుడు హత్యకు పాల్పడినట్లు ప్రాసిక్యూటర్‌ తెలిపారు. నిందితుడు, బాధిత వ్యక్తిని కత్తితో పడిచి చంపాడు. ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన సమాచారంతో విచారణ తేలికయ్యిందని అధికారులు వివరించారు. 

 

Back to Top