హాలీవుడ్ సినిమాకు హీరోగా టాలీవుడ్ నటుడు
- February 02, 2019అర్జున్‌రెడ్డి సినిమాతో రాత్రిరాత్రికే స్టార్ నటుడు అయిపోయారు రాహుల్ రామకృష్ణ. తర్వాత హుశారు, సమ్మోహనం, గీత గోవిందం ,అలాగే స్టార్ హీరో మహేష్ బాబు
నటించిన భరత్ అనే నేను లాంటి సినిమాలలో సందడి చేశారు. ఇప్పుడు రాహుల్ ఓ హాలీవుడ్ సినిమాలో కథానాయకుడుగా నటించబోతున్నారు. ఈ సినిమాకు
“సిల్క్ రోడ్” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ప్రదీప్ కటసాని దర్శకత్వ, నిర్మాణ భాద్యతలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను రాహుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “ఈ సినిమా సంబంధించిన విషయం నేను ఉహించిన దాని కంటే వేగంగా బయటకు వచ్చింది. చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. హాలీవుడ్‌లోకి ఎంట్రి ఇవ్వబోతున్నాను. మేము పడే కష్టానికి ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.
అమెరికాలో నివసించే తెలుగు విద్యార్థుల నేపథ్యం అధారంగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అక్కడ ఉండే అసాంఘిక వ్వవహరాలు మన విద్యార్థులపై ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయి. సైబర్ క్రైమ్, డ్రగ్స్ చుట్టూ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తుంది. దాదాపు 2గంటల విడిదితో ఈ చిత్రం ఉండనుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు