ఫ్రీ బస్‌ రైడ్‌: కండిషన్స్‌ అప్లయ్‌

ఫ్రీ బస్‌ రైడ్‌: కండిషన్స్‌ అప్లయ్‌

ఈ శుక్రవారం దుబాయ్‌ నుంచి హట్టా వాడికి వెళ్ళే టూరిస్టులకు, రెసిడెంట్స్‌కి ఉచిత బస్సు ప్రయాణం లభించనుంది. హ్యాపీనెస్‌ వీక్‌లో 2019లో భాగంగా రోడ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఉచిత బస్సుల్ని హట్టా వాడి హబ్‌కి దుబాయ్‌లోని మూడు పికప్‌ పాయింట్స్‌ నుంచి నడుపుతోంది. మాల్‌ ఆఫ్‌ ఎమిరేట్స్‌ మెట్రో స్టేషన్‌, అల్‌ రష్దియా మెట్రో స్టేషన్‌, దుబాయ్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ఈ బస్సులు ప్రయాణమవుతాయి. ఫ్రీ బస్‌ సర్వీస్‌తోపాటు వాడి హబ్‌లోకి ఫ్రీ ఎంట్రీ కూడా లభిస్తుంది. సీట్లు లిమిటెడ్‌ కాబట్టి, బస్‌ని తొందరగా రీచ్‌ అవ్వాల్సి వుంటుంది. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 20వ తేదీన ఇంటర్నేషనల్‌ హ్యాపీనెస్‌ డేగా నిర్వహిస్తున్నారు. 

 

Back to Top