ఎయిర్ ఇండియా విమాన సేవలకు అంతరాయం
- April 27, 2019
ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కారణంగా శనివారం ఉదయం నుంచి సర్వీసులు స్తంభించిపోయాయి. దీంతో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అలాగే అనేక విమానాలు నిర్దేశిత సమయం కంటే ఆలస్యంగా బయలుదేరనున్నాయి. దీంతో దిల్లీ, ముంబయి విమానాశ్రయాలు ప్రయాణికులతో రద్దీగా మారినట్లు సమాచారం. దీనిపై ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ''ఎస్‌ఐటీఏ సర్వర్ డౌన్ అయింది. ఇప్పటికే సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే సేవలు ప్రారంభమవుతాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము'' అని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







