మెగా హీరో సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి
- April 27, 2019మెగా కుటుంబం నుంచి సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకు బాణీలు అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రీలుక్‌ను కూడా విడుదల చేశారు. సినిమాలో మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. యూనిట్లోకి ఆయన్ను స్వాగతిస్తూ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో విజయ్ ప్రతినాయకుడి పాత్రను పోషించబోతున్నారు. 'సైరా నరసింహారెడ్డి' తర్వాత ఆయన తెలుగులో నటిస్తున్న రెండో సినిమా ఇది కావడం విశేషం.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?