సౌదీ అరేబియాలో శాశ్వత నివాసం కోసం వలసదారులకు ఛాన్స్
- June 24, 2019సౌదీ అరేబియాలోని ప్రీమియమ్ రెసిడెన్సీ సెంటర్, తమ సేవలను ఆదివారం నుంచి ప్రారంభించింది. ఎలక్ట్రానిక్ విధానంలో అప్లికేషన్లను ప్రాసెసింగ్ చేయడం, ప్రీమియమ్ రెసిడెన్సీ సిస్టమ్ కోసం దరఖాస్తు చేసుకోవడం వంటివి ఈ కేంద్రంలో అందుబాటులో వుంటాయి. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్ సౌద్ నాయకత్వంలోని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ జారీ చేసిన డిక్రీకి అనుగుణంగా ఈ సేవల్ని ప్రారంభించారు. కాంప్రహెన్సివ్ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ 'ఎస్ఎపిఆర్సి' ద్వారా ఎవరైతే సేవల్ని పొందాలనుకుంటున్నారో, వారికి ఈ కేంద్రంలో అన్ని సేవలూ లభిస్తాయి. రెండు రకాల ప్రీమియమ్ రెసిడెన్సీలను ఈ సెంటర్ అందిస్తుంది. పర్మనెంట్ ప్రీమియమ్ రెసిడెన్సీ - వన్ టైమ్ లైఫ్‌టైమ్ ఫీజు. టెంపరరీ ప్రీమియమ్ రెసిడెన్సీ - ఏడాది రుసుముకుగాను. సౌదీలో సెటిలైపోయి, తమ వ్యాపారాల్ని విస్తరించుకోవాలనుకునేవారికి ప్రీమియమ్ రెసిడెన్సీ ఉపకరిస్తుంది. ఈ సెంటర్ ఫైనాన్షియల్‌గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇండిపెండెంట్ ఎన్టైటీ - కౌన్సిల్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్ అండ్ డెవలప్మెంట్తో అసోసియేట్ అయి వుంటుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు