బాలీవుడ్‌కు ‘ఓ బేబీ’!
- July 10, 2019సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొరియన్ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తోంది. దీంతో ఓ బేబీని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్స్ బాలీవుడ్ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. బాలీవుడ్ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించటంతో పాటు ఓ కీలక పాత్రలో నటించేందుకు రానా సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత పాత్రకు కంగనా లేదా అలియా భట్ల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగులో నందిని రెడ్డి దర్శకత్వం వహించగా రావూ రమేష్, రాజేంద్రప్రసాద్, లక్ష్మీ, తేజలు కీలక పాత్రల్లో నటించారు. 70 ఏళ్ల వృద్దురాళికి యవ్వనం తిరిగి వస్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి. ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్‌ను సైతం అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?