రాఫెల్ లో 1 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న కేరళ వలస డ్రైవర్
- August 10, 2019అబుదాబీలో వుంటోన్న కేరళ వలసదారుడు 1 మిలియన్ దిర్హామ్‌లను గెల్చుకున్నాడు. దుబాయ్‌లోని ఓ మాల్ నిర్వహించిన కాంటెస్ట్‌లో ఈ బహుమతి ఆయన్ని వరించింది. 43 ఏళ్ళ షానవాస్ ఈ బహుమతిని గెల్చుకున్న అనంతరం పట్టలేని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తాను యాభయ్యేళ్ళు పనిచేసినా ఇంత మొత్తం సంపాదించేవాడిని కాదేమోనని చెప్పాడాయన. 1997లో పొట్ట చేత పట్టుకుని అబుదాబీ వచ్చాననీ, డ్రైవింగ్ లైసెన్స్ పొంది డ్రైవర్‌గా జీవనోపాధి పొందుతున్నానని అన్నాడు. ప్రస్తుతం 2,500 దిర్హామ్‌ల సంపాదన తనకు లభిస్తోందని చెప్పాడు షానవాస్. మాల్ మిలియనీర్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ లక్కీ ఛాన్స్ షానవాస్కి దక్కింది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు