మహిళలకు బిగ్ అలర్ట్..
- March 16, 2025
మహిళలకు అలర్ట్.. పోస్ట్ ఆఫీస్ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ (MSSC) పథకం త్వరలో ముగియనుంది. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వం ఈ పథకంలో పెట్టుబడి సమయాన్ని పొడిగించలేదు.
పోస్ట్ ఆఫీస్ కింద నిర్వహించే ఈ పథకంలో మహిళలు పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ 31 మార్చి 2025గా నిర్ణయించింది. ఈ పథకంలో ఇంకా పెట్టుబడి పెట్టని మహిళలకు మార్చి 2025 వరకు సమయం ఉంది. ఆ తర్వాత ఈ స్కీమ్ క్లోజ్ చేయొచ్చు లేదా ప్రభుత్వం పొడిగించవచ్చు.
మహిళలకు ఈ స్కీమ్ బెస్ట్:
భారత ప్రభుత్వం మార్చి 31, 2023న స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా మహిళలు, బాలికల కోసం MSSC (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం రెండు సంవత్సరాల కాలానికి అందుబాటులో ఉంటుంది. మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించడం, వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద 2 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధి కూడా అందిస్తోంది.
ఎంత వడ్డీ వస్తుందంటే?
దేశంలోని ఏ మహిళ అయినా ఈ పథకంలో 2 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద భారీ వడ్డీ కూడా అందిస్తుంది. MSSC పథకంపై 7.5శాతం వార్షిక వడ్డీ అందిస్తుంది. బ్యాంకుల 2 ఏళ్ల FD కన్నా ఎక్కువ. ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. మీ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ లేదా రిజిస్టర్డ్ బ్యాంకులలో సులభంగా ఓపెన్ చేయొచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు? :
ఈ పథకం కింద భారత్‌లో నివసించే ఏ మహిళ అయినా కనీసం రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 2 ఏళ్ల వ్యవధి తర్వాత మొత్తం అసలు, వడ్డీ తిరిగి చెల్లిస్తుంది. ఒక ఏడాది తర్వాత ఖాతాదారుడు మొత్తంలో 40శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
మహిళా సమ్మాన్ యోజన రూల్స్:
తీవ్రమైన అనారోగ్యం లేదా ఖాతాదారుడి మరణం వంటి పరిస్థితులలో అకౌంట్ ముందస్తుగా క్లోజ్ చేయొచ్చు. అయితే, ఖాతాదారుడు 6 నెలల తర్వాత ఖాతాను క్లోజ్ చేస్తే వడ్డీ రేటు తగ్గుతుంది.
మార్చి 31 వరకు పెట్టుబడి పెట్టవచ్చు:
ప్రభుత్వం అందించే (MSSC) స్కీమ్ ఎలాంటి పొడిగింపును ప్రకటించలేదు. అందుకే మార్చి 31, 2025 లోగా పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అధిక వడ్డీ రేటుతో మహిళలకు అద్భుతమైన పెట్టుబడి ఆప్షన్ అని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్