కువైట్‌లో తగ్గుతున్న డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య..!!
- March 25, 2025
కువైట్: కువైట్‌లో డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2024 మూడవ త్రైమాసికం చివరి నాటికి కువైట్‌లో గృహ కార్మికుల సంఖ్య 740,000 కు చేరుకుందని, ఇది మొత్తం ప్రవాస శ్రామిక శక్తిలో 25.3% అని సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ఇది 2023లో 790,000 నుండి 6.3% తగ్గిందని తెలిపింది. ఈ మొత్తం గృహ కార్మికులలో, 411,000 మంది మహిళలు, 329,000 మంది పురుషులు ఉన్నారని వెల్లడించారు.
అల్-షాల్ నివేదిక ప్రకారం.. 2024 3వ త్రైమాసికం చివరి నాటికి దాదాపు 149,000 మంది ఉన్న ఫిలిప్పీన్స్.. అత్యధిక సంఖ్యలో ఉన్న మహిళా గృహ కార్మికులుగా గుర్తింపు పొందారు. 2023 మూడవ త్రైమాసికం చివరి నాటికి మొత్తం ఫిలిప్పీన్స్ మహిళా గృహ కార్మికుల సంఖ్య 193,000గా నమోదైంది.
ఇక గృహ కార్మికులలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారని నివేదిక తెలిపింది. వీరి మొత్తం జనాభా సుమారు 219,000గా ఉంది. 2023లో ఇదే కాలంలో ఇది 251,000 నమోదు అయిందని తెలిపారు. గృహ, ఇతర ప్రవాస కార్మికులను కలిపితే.. కువైట్‌లో భారతీయులు అతిపెద్ద శ్రామిక శక్తిగా ఉన్నారు. 2024 మూడవ త్రైమాసికం చివరి నాటికి మొత్తం 887,000 మంది కార్మికులు ఉన్నారు.
తాజా వార్తలు
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగే యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం
- కర్నూల్లో ప్రధాని మోదీ రాకకు టీడీపీ ఏర్పాట్లు