ప్రసాదం పై జీఎస్టీకి మినహాయింపు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- March 25, 2025
న్యూ ఢిల్లీ: ప్రార్థనా మందిరాల్లో అమ్మే ప్రసాదం పై జీఎస్టీకి మినహాయింపు ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ఇవాళ లోక్‌సభలో పలు బిల్లుల పై చర్చ జరిగింది.
ఆర్థిక బిల్లు 2025పై జరిగిన చర్చలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రసాదాలకు జీఎస్టీ వర్తించదని చెప్పారు. అలాగే, ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తామని తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు వచ్చే నెల నుంచి ఇండియాపై టారిఫ్ విధిస్తామని అంటున్న నేపథ్యంలో గూగుల్, మెటా వంటి దిగ్గజ అమెరికా సంస్థలకు అనుకూలంగా ఆన్లైన్ యాడ్స్‌పై ఈ పన్ను తొలగించాలన్న ప్రతిపాదన ఉందని విశ్లేషకులు అంటున్నారు. 2016 జూన్ 1 నుంచి 6% పన్నును అమలు చేస్తున్నారు. దాన్నే ఇప్పుడు తొలగించనున్నారు.
ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లుపై వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. గత నెల 13న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, సెలెక్ట్ కమిటీకి పంపారు.వచ్చే పార్లమెంట్ సమావేశాలలోపు ఆ రిపోర్టును కమిటీ సమర్పిస్తుంది. మరోవైపు కస్టమ్స్ టారిఫ్‌లను కూడా రేషనలైజేషన్ చేస్తామని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్