BAPS హిందూ మందిర్ కోసం అబుదాబి పోలీసుల గైడ్ లైన్స్..!!

- March 26, 2025 , by Maagulf
BAPS హిందూ మందిర్ కోసం అబుదాబి పోలీసుల గైడ్ లైన్స్..!!

అబుదాబి: పండుగలు, సెలవు రోజుల్లో అబుదాభిలోని BAPS హిందూ మందిర్ ను సందర్శించే భక్తుల సంఖ్య అనుహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే పండుగలను పురస్కరించుకొని అబుదాబి పోలీసులు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో అందరూ గడపాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేలాది మంది సందర్శకులు భగవంతుడిని దర్శించుకోవాలని సూచించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో.. రద్దీ లాంటి సమస్యలను అధిగమించేందుకు ముందుగానే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆలయం ఉదయం 9 గంటలు గంటల నుంచి రాత్రి 8 గంటలు (రాత్రి 8 గంటల వరకు చివరి ప్రవేశం) వరకు తెరిచి ఉంటుంది. సందర్శకులు “మందిర్ అబుదాబి” యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ముందుగానే నమోదు చేసుకోవాలి: https://www.mandir.ae/visit

మీ నిర్ణీత సమయ స్లాట్ ప్రకారం మందిర్‌కు చేరుకోవాలని సూచించారు. మందిర్ క్యాంపస్‌లో మెరుగైన పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కాగా, సోమవారం మందిర్ మూసివేయబడుగుందని పేర్కొన్నారు. మరింత సమచారం కోసం  https://www.mandir.ae/visit ను సందర్శించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com