సౌదీ అరేబియాలో డెంగ్యూ జ్వరంపై సర్వే..!!

- March 26, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో డెంగ్యూ జ్వరంపై సర్వే..!!

రియాద్: సౌదీ పబ్లిక్ హెల్త్ అథారిటీ (వెకాయా) మరో కార్యక్రమానికి తెరతీసింది. రాజ్యం అంతటా డెంగ్యూ జ్వరం ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి విస్తృతమైన సర్వే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం 12 నెలల్లోపు పూర్తిచేయాలని నిర్ణయించబడింది. రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో డెంగ్యూ జ్వరం ఎపిడెమియోలాజికల్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి దీర్ఘకాలిక, విస్తృతమైన సర్వే కార్యక్రమాన్ని అమలు చేయడానికి అధికారులు ప్రణాళికులు రూపొందించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. డెంగ్యూ జ్వరం దోమల కాటు ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా పేద పట్టణ ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తుంది. డెంగ్యూ తరచుగా లక్షణరహితంగా ఉంటుంది. సాధారణంగా సంక్రమణ తర్వాత 3 నుండి 14 రోజుల తర్వాత లక్షణాలు కన్పిస్తాయి. వీటిలో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు-కీళ్ల నొప్పులు , చర్మంపై దురద-దద్దుర్లు కన్పిస్తాయి. డెంగ్యూ జ్వరం ఏడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com