హైకోర్టు లాయర్ల సంఘం అధ్యక్షుడిగా చిదంబరం

- March 28, 2025 , by Maagulf
హైకోర్టు లాయర్ల సంఘం అధ్యక్షుడిగా చిదంబరం

అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం (APHCAA) ఎన్నికల్లో అధ్యక్షులుగా సీనియర్‌ లాయర్‌ కలిగినీడి చిదంబరం వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి జివిఎస్‌ కిషోర్‌ కుమార్‌ పై 328 ఓట్ల తేడాతో గెలిచారు.చిదంబరానికి 937 ఓట్లు రాగా, కిషోర్‌కు 609 ఓట్లు వచ్చాయి.ఈ ఎన్నికల్లో 3389 ఓట్లకు గాను 1744 ఓట్లు పోలయ్యాయి.ఉపాధ్యక్షులుగా కెవి రఘువీర్‌ విజయం సాధించారు.సమీప అభ్యర్థి తోట సునీతపై 248 ఓట్ల తేడాతో గెలుపొందారు.ప్రధాన కార్యదర్శిగా చేజర్ల సుబోధ్‌ తన సమీప అభ్యర్థి వెంకటేశ్వరరావుపై 529 ఓట్లతో గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా పితాని చంద్రశేఖరరెడ్డి, గ్రంథాలయ కార్యదర్శిగా జంపని శ్రీదేవి, కోశాధికారిగా యద్దల దుర్గారావు, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా తోట తేజేశ్వరరావు (ఏకగ్రీవం), మహిళా ప్రతినిధిగా కంచర్ల ప్రసన్న, ఇసి సభ్యులుగా (30 సంవత్సరాలు) ఎవివిఎస్‌ఎన్‌ మూర్తి (ఏకగ్రీవం), ఇసి సభ్యులుగా (20 సంవత్సరాలు) సత్యానందరావు కోనే (ఏకగ్రీవం), మహిళా ఇసి సభ్యురాలిగా మంచాల ఉమాదేవి, ఇసి సభ్యులుగా గోడవర్తి కిరణ్‌బాబు, నల్లమూరు స్వర్ణలత, దీరధ రెడ్డి కారుమంచి, వివికె చక్రవర్తి ఎన్నికయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com