తీవ్రవాదాన్ని అణచివేయక తప్పదు

- July 06, 2016 , by Maagulf
తీవ్రవాదాన్ని అణచివేయక తప్పదు

మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, ముందస్తు దాడుల ద్వారా తీవ్రవాదానికి చెక్‌ పెట్టవచ్చునని అభిప్రాయపడింది. దేశాన్ని తీవ్రవాదం నుంచి రక్షించాలంటే, ఇదొక్కటే మార్గమని డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌, ఇంటీరియర్‌ మినిస్టర్‌ షేక్‌ మొహమ్మద్‌ అల్‌ ఖాలెద్‌ అల్‌ హమాద్‌ అల్‌ సబా చెప్పారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికి సంబంధించి ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాల్నిపరిగణనలోకి తీసుకున్నారు. జిసిసి దేశాలతో సంయుక్తంగా తీవ్రవాదంపై పోరాటం చేయాల్సి ఉంటుందనీ, అప్పుడే జిసిసి రీజయన్‌ తీవ్రవాదుల నుంచి ఉపశమనం పొందుతుందని తెలిపారు షేక్‌ మొహమ్మద్‌. ఈద్‌ అల్‌ ఫితర్‌ సందర్భంగా దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతోపాటు, అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నట్లు వివరించారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com