రమదాన్ మాసంలో హరమైన్ హై-స్పీడ్ రైల్వే కొత్త రికార్డులు..!!
- April 01, 2025
జెడ్డా: పవిత్ర రమదాన్ మాసంలో హరమైన్ హై-స్పీడ్ రైల్వే 1.2 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 21% పెరుగుదల అని ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్ ప్రకటించారు. రైల్వేలు, పబ్లిక్ బస్సులు, రైడ్-హెయిలింగ్ సేవలు, డెలివరీ యాప్‌లు, పోస్టల్ లాజిస్టిక్స్‌తో సహా పలు రంగాలలో అధిక పనితీరును కనబరిచాయని డాక్టర్ అల్-రుమైహ్ తెలిపారు. "రమదాన్ సందర్భంగా డిమాండ్ కు అనుగుణంగా సమగ్ర రవాణా సేవలను అందించాము. కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రతిబింబించే రికార్డు గణాంకాలను సాధించాము" అని ఆయన అన్నారు. రమదాన్ సందర్భంగా ప్రభుత్వ రవాణా బస్సులు నగరాల్లో 10 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించాయన్నారు. ఇందులో మక్కా, మదీనా మొత్తం 34% వాటాను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాముల పాత్రను కూడా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!